వైద్య విధాన పరిషత్‌లో 3,943 పోస్టులు Telangana, Vaidya Vidhana Parishad Jobs Recruitment Notification for 3943 posts i.e., Doctor, Civil Surgeon, RMO, Deputy Civil Surgeon, Civil Asst. Surgeon, Dental Civil Surgeon Deputy Dental Surgeon, Dental Assistant Surgeon, Asst. Director, AO, Section Officer, Senior Assistant, Junior Assistant, Pharmacy Supervisor, Pharmacist, Lab Technician, Health Inspector, Chief Radiographer, Radiographer, Dark Room Asst, Physiotherapist, Refractionist, Junior Analyst, Ophthalmologist, Audiometer technician, Nursing Superintendent, Head Nurse, Staff Nurse, Midwines, ANM, MPHA, etc.,
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3వేల 943 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ కేటగిరీల్లో పోస్టుల వివరాలను కూడా జీవోలో ప్రకటించారు.
♦సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వసతులు పెంచడం, కొత్తగా హాస్పిటల్స్ ని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో అప్‌గ్రేడ్ చేయడం, కేసీఆర్ కిట్ల పథకం వంటి అనేక స్టెప్స్ తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ఇప్పటి వరకు కొంత వరకు ఉన్న కొరత తాజాగా చేపట్టే నియామకాలతో తీరుతుందన్నారు. భారీ ఎత్తున డాక్టర్లు, సిబ్బంది వస్తారన్నారు. ఈ నియామకాలతో ప్రభుత్వ ఆస్పత్రుకు వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.
♦వివిధ కేటగిరీల్లో పోస్టుల వివరాలు…
డాక్టర్లు…
♦సివిల్ సర్జన్/సివిల్ సర్జన్ ఆర్ఎంఓ -483, డిప్యూటీ సివిల్ సర్జన్ -685,సివిల్ అసిస్టెంట్ సర్జన్ -1,191,డెంటల్ సివిల్ సర్జన్ -12, డిప్యూటీ డెంటల్ సర్జన్ -16,డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -10,🍒
ఇతర సిబ్బంది…
🌳అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) ఎల్.ఎస్. (గ్రేడ్-1) -02,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ /ఎల్.ఎస్.( గ్రేడ్-2) -16, సూపరింటెండెంట్ /సెక్షన్ ఆఫీసర్ -32,సీనియర్ అసిస్టెంట్ -30,జూనియర్ అసిస్టెంట్ -56,ఫార్మసీ సూపర్ వైజర్ -01, ఫార్మసిస్ట్ గ్రేడ్-1 06, ఫార్మసిస్ట్ (గ్రేడ్-2) -52, ల్యాబ్ టెక్నీషియన్ -152, హెల్త్ ఇన్స్పెక్టర్ -09. చీఫ్ రేడియోగ్రాఫర్-07, రేడియోగ్రాఫర్ -33, డార్క్ రూమ్ అసిస్టెంట్ -36, ఫిజియోథెరపిస్ట్ -45, రిఫ్రాక్షనిస్ట్ -34, జూనియర్ అనలిస్ట్ -44, ఆప్తాలమిస్ట్ అసిస్టెంట్ -22, ఆడియోమెట్రీ టెక్నీషియన్ -01, నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్-1) -28, నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్-2) -38,హెడ్ నర్స్-162,స్టాఫ్ నర్స్ -565,మిడ్‌వైవ్స్ -126,ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ (ఎఫ్) -49.🏀
🎾తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పోస్టులు రావడం పట్ల వివిధ వైద్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ పోస్టుల నియామకాలు పూర్తయితే డాక్టర్లు, సిబ్బంది కొరత తీరడంతో పాటు … రోగులకు మంచి వైద్యం అందించడానికి వీలవుతుందన్నారు. డాక్టర్లు, సిబ్బంది పై కూడా కొంత భారం తగ్గుతుందన్నారు